Top News

Bore in 10th Ward | బాన్సువాడ 10వ వార్డులో నూతన బోరు ఏర్పాటు - తాగునీటి సమస్యకు పరిష్కారం

బాన్సువాడ 10వ వార్డులో నూతన బోరు ఏర్పాటు - తాగునీటి సమస్యకు పరిష్కారం

మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ ఆదేశాలతో బోరు పనులు - కౌన్సిల్ సభ్యుడు కాసుల రోహిత్ వెల్లడి

తాగునీటిని పొదుపుగా వాడాలని సూచన - భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నూతన బోరును ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ ఆదేశాల మేరకు కౌన్సిల్ సహకారంతో బోరు వేయించినట్లు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్ తెలిపారు.

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం వర్షపాతం తక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు కొంతమేర తగ్గుతున్నాయని, ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.

నీటి వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నగేష్‌తో పాటు కాళిక్, ఆత్మ కమిటీ చైర్మన్ మాసాని రవీందర్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post