విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది - కాసుల బాలరాజు
గవర్నమెంట్ హై స్కూల్ లో యూనిఫామ్స్, షూస్ పంపిణీ
బాన్సువాడ, సెప్టెంబర్ 07: బాన్సువాడ గవర్నమెంట్ హై స్కూల్ లో యూనిఫార్మ్స్ మరియు షూస్ పంపిణీ కార్యక్రమం హెడ్మాస్టర్ లక్క నరహరి అధ్యక్షతన జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, స్థానిక కౌన్సిలర్ మహ్మద్ కాలిక్, కో ఆప్షన్ సభ్యులు కమర్ సుల్తానా గౌస్, ఏపీఐసీసీ చైర్మన్ సరిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నిజాంసాగర్ ప్రదీప్ పటేల్, దామరంచ సర్పంచ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీర్పూర్ యామ రాములు, కాంత్ రెడ్డి, కాశీరాం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.






Post a Comment