Top News

BRS Representation | ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలి

ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలి

ఆర్డీఓకు బీఆర్ఎస్ పార్టీ వినతి

హామీల అమలులో నిర్లక్ష్యం వీడాలని డిమాండ్

బాన్సువాడ, సెప్టెంబర్ 07: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అర్హులైన ప్రతి పేద వారికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని కోరారు.

వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు, రైతులకు రుణ ఉపశమనం, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని, జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, మోరల్ శ్రీనివాస్ రావు, బాడీ శ్రీనివాస్, మోచి గణేష్, అక్బర్, ఇసాక్, కౌన్సిలర్లు ఖలీల్, ఫెరోజ్, మాక్బూల్, మొగులన్న, షఫీ, అతీఫ్, కాసుల బాబు, ఖాలేద్, అఫ్జల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా బాన్సువాడలో ధర్నా.. రాస్తారోకో

కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట.. ట్రాఫిక్ కు అంతరాయం

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీగా కూడిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ ధర్నా నిర్వహించి రాస్తారోకో చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను రోడ్డుపై నుండి తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లించారు. పట్టణంలో పోలీసులు మోహరించి పర్యవేక్షిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post