Top News

IRCS Elections | కామారెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

కామారెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ - రూ.10 వేల ఫీజు, ఇద్దరు మద్దతుదారులు తప్పనిసరి

కామారెడ్డి, సెప్టెంబర్ 23: కామారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా బ్రాంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఎన్నికల అధికారులు ఈ మేరకు షెడ్యూల్ ను ప్రకటించారు.

నామినేషన్ల వివరాలు:

- ఫారాల పంపిణీ: సెప్టెంబర్ 24న ఉదయం 9 గంటల నుంచి కలెక్టరేట్ లోని IDOC రూమ్ నంబర్ 111లో నామినేషన్ ఫారాలు అందుబాటులో ఉంటాయి. తహశీల్దార్ లేదా MPDO కార్యాలయాల నుంచి కూడా పొందవచ్చు.

- స్వీకరణ: పూర్తి చేసిన నామినేషన్లను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే IDOC రూమ్ నం. 111లో సమర్పించాలి. 1 గంట తర్వాత స్వీకరించరు.

- నిబంధనలు: అభ్యర్థి పేరు తప్పనిసరిగా రెడ్ క్రాస్ ఓటర్ల జాబితాలో ఉండాలి. నామినేషన్ తో పాటు రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, రూ.10,000 నగదు రుసుము చెల్లించాలి. ఒక ప్రతిపాదకుడు, ఒక మద్దతుదారుడు తప్పనిసరి. అభ్యర్థి, ప్రతిపాదకుడు, మద్దతుదారుల ఆధార్ జిరాక్స్ లు జతచేయాలి. ఈ ఎన్నికల్లో ఎలాంటి గుర్తులు ఉండవు.

- పరిశీలన: సెప్టెంబర్ 25న ఉదయం 10 గం. నుంచి మ.1 గం. వరకు నామినేషన్ల పరిశీలన.

- ఉపసంహరణ: సెప్టెంబర్ 26న ఉదయం 10 గం. నుంచి మ.1 గం. వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. రుసుము తిరిగి చెల్లించబడదు.

మరిన్ని వివరాలకు కలెక్టరేట్ లోని IDOC రూమ్ నం.111లో ఎన్నికల అధికారిని లేదా 9989487624 నంబర్ లో సంప్రదించాలని ఎన్నికల అధికారి పి.రామమోహన్, ఉప ఎన్నికల అధికారి తెలిపారు.



Post a Comment

Previous Post Next Post