Top News

Journalists Training Classes | బాన్సువాడలో రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతులు - స్థలాలను పరిశీలించిన TUWJ (IJU) నాయకులు



బాన్సువాడలో రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతులు - స్థలాలను పరిశీలించిన TUWJ (IJU) నాయకులు 

సెప్టెంబర్ 29, 30 తేదీలలో శిక్షణ 

ఫేక్ న్యూస్, AI, సైబర్ క్రైమ్, RTI చట్టంపై ప్రత్యేక క్లాసులు - మీడియా అకాడమీ చైర్మన్, కలెక్టర్, ఎస్పీతో ముఖాముఖి

బాన్సువాడ, సెప్టెంబర్ 22: తెలంగాణ మీడియా అకాడమీ (MATG),  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ-IJU) సంయుక్త ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం 2026 సెప్టెంబర్ 29, 30 తేదీలలో బాన్సువాడలో జరగనుంది.

ఇందులో భాగంగా శిక్షణ తరగతుల నిర్వహణకు అనువైన ప్రదేశాలను TUWJ-IJU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రజనీకాంత్, రాజేష్ లు మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని తాడ్కోల్ రెడ్డి సంఘం భవనం, సరస్వతి మందిర్ కళ్యాణ మండపం, అలాగే దేశాయిపేటలోని SRNK డిగ్రీ కళాశాలలోని సెమినార్ హాల్ ను పరిశీలించారు. తరగతుల నిర్వహణకు SRNK డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు హాల్ గురించి తెలంగాణ మీడియా అకాడమీ అధికారులకు వివరించారు.

జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులందరూ శిక్షణ తరగతులకు హాజరు కావాలని, ఈ కళాశాల ప్రదేశం జర్నలిస్టులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

వారితో పాటు TUWJ-IJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.ఏ. లతీఫ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎండి యూనస్, జిల్లా సహాయ కార్యదర్శి పంతులు శ్రీనివాస్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మొయిన్, చంద్రశేఖర్, జర్నలిస్టులు రాజేశ్వర్ రెడ్డి, మధుసుదన్ రెడ్డి, సతీష్, శ్రీనివాస్, హన్మాండ్లు, రుద్రంగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

షెడ్యూల్ వివరాలు:

ప్రారంభోత్సవం - సెప్టెంబర్ 29 మంగళవారం ఉదయం 10.00 నుండి 12.00 గంటల వరకు ప్రారంభ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించనుండగా, బాన్సువాడ శాసన సభ్యులు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

మొదటి రోజు (29.09.2026) శిక్షణా అంశాలు:

మధ్యాహ్నం 12.00 - 1.10 వరకు: సీనియర్ జర్నలిస్ట్, RTI మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి - సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన.

మధ్యాహ్నం 1.15 - 2.00 వరకు: భోజన విరామం.

మధ్యాహ్నం 2.00 - 3.10 వరకు: సీనియర్ జర్నలిస్ట్ గోవింద రెడ్డి - నేర వార్తలు - చేయాల్సినవి, చేయకూడనివి.

మధ్యాహ్నం 3.10 - 4.20 వరకు: దిశ ఎడిటర్ మార్కండేయ - వార్తా కథనాలు / ప్రత్యేక కథనాలు.

సాయంత్రం 4.20 - 5.30 వరకు: సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహ స్వామి - ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, AI, సోషల్ మీడియా.

రెండవ రోజు (30.09.2026 బుధవారం ):

ఉదయం 10.00 - 11.10 వరకు: మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి - మీడియా పట్టాలు - నైతిక నియమావళి.

ఉదయం 11.10 - 12.20 వరకు: సీనియర్ జర్నలిస్ట్ ఆర్. ఉమామహేశ్వరరావు - భాష - తప్పొప్పులు, దిద్దుబాట్లు.

మధ్యాహ్నం 12.20 - 1.30 వరకు: సీనియర్ జర్నలిస్ట్ తోట భవనారాయణ - గ్రామీణ వార్తలు - ఎలక్ట్రానిక్ మీడియా.

మధ్యాహ్నం 1.30 - 2.00 వరకు: భోజన విరామం.

మధ్యాహ్నం 2.00 - 3.10 వరకు: Team International Justice Mission - కె. ముత్తయ్య - మానవ అక్రమ రవాణా - బాలల వెట్టి చాకిరీ నిర్మూలన.

సాయంత్రం 3.10 - 4.20 వరకు: జిల్లా కలెక్టర్ / ఎస్పీ / జాయింట్ కలెక్టర్ / సీఈవో అధికారులతో ముఖాముఖి - జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ.

ముగింపు కార్యక్రమం సాయంత్రం 4.30 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,  హాజరుకానున్నారు. సభాధ్యక్షులుగా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారు.

కామారెడ్డి జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ శిక్షణా తరగతులకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.








Post a Comment

Previous Post Next Post