Top News

SBI PAI | పాముకాటుతో మృతి చెందిన రైతుకు SBI PAI బీమా - రూ.10 లక్షల చెక్ పంపిణీ

బాన్సువాడలో పాముకాటుతో మృతి చెందిన రైతుకు SBI PAI బీమా - రూ.10 లక్షల చెక్ పంపిణీ

ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అవగాహనతో కుటుంబానికి అండగా నిలిచిన SBI - భూమవ్వకు 10 లక్షల బీమా

SBI PAI ఇన్సూరెన్స్ తో బాధిత కుటుంబానికి భరోసా - SBI మేనేజర్ అజయ్ రామ్ ప్రకాష్ చే చెక్ అందజేత

బాన్సువాడ, సెప్టెంబర్ 22: పాము కాటుతో మృతి చెందిన యువకుడి కుటుంబానికి SBI PAI ఇన్సూరెన్స్ ద్వారా రూ.10 లక్షల బీమా అందించి బాన్సువాడ SBI యాజమాన్యం మానవత్వం చాటుకుంది.

వివరాలు: బాన్సువాడ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వరగంతం భూమవ్వ కొడుకు రాజు ఇటీవల పాము కాటుతో మృతి చెందాడు. తమ గ్రామంలో SST ఆర్థిక అక్షరాస్యత కేంద్రం (CFL), బాన్సువాడ కౌన్సిలర్లు పర్వయ్య, లక్ష్మా గౌడ్ రాజు ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పథకాలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేయగా, భూమవ్వ తన కొడుకు మృతి విషయాన్ని వారికి తెలియజేసింది.

CFL కౌన్సిలర్లు ఆమె కొడుకు పాస్ బుక్ పరిశీలించి బాన్సువాడ SBIని సంప్రదించగా, అతని ఖాతాకు SBI PAI ఇన్సూరెన్స్ ఉందని మేనేజర్ అజయ్ రామ్ ప్రకాష్ తెలిపారు. వెంటనే బీమా కోసం దరఖాస్తు చేయించగా, నామినీ అయిన తల్లి భూమవ్వ ఖాతాకు రూ.10,00,000 జమ అయ్యాయి.

ఈ సందర్భంగా SBI PAI ఇన్సూరెన్స్ చెక్ ను బాన్సువాడ SBI మేనేజర్ అజయ్ రామ్ ప్రకాష్, SST ఆర్థిక అక్షరాస్యత కేంద్రం డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు పర్వయ్య, లక్ష్మా గౌడ్ రాజు చేతుల మీదుగా అందజేశారు.

ఈ సహాయం అందించినందుకు బాధితురాలు భూమవ్వ SBI మేనేజర్ అజయ్ రామ్ ప్రకాష్ గారికి, SST ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి. అశోక్ కుమార్, CFL కౌన్సిలర్లు పర్వయ్య, లక్ష్మా గౌడ్ రాజు, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, BDS శశిరేఖకు కృతజ్ఞతలు తెలిపింది.

ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్ పై ఉన్న PAI వంటి బీమా సౌకర్యాల గురించి తెలుసుకోవాలని, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా అవగాహన పొందాలని నిర్వాహకులు సూచించారు.

Post a Comment

Previous Post Next Post