బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణకు ఏర్పాట్లు పరిశీలించిన మీడియా అకాడమీ బృందం
SRNK డిగ్రీ కళాశాలలో శిక్షణా తరగతులు
వర్క్ షాప్ ను సద్వినియోగం చేసుకోవాలి : వెంకటేశ్వర్లు,మీడియా అకాడమీ కార్యదర్శి
బాన్సువాడ, సెప్టెంబర్ 24: బాన్సువాడలో ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతుల ఏర్పాట్లను గురువారం తెలంగాణ మీడియా అకాడమీ బృందం పరిశీలించింది.
తెలంగాణ మీడియా అకాడమీ, TUWJ-IJU సంయుక్త ఆధ్వర్యంలో దేశాయిపేటలోని SRNK డిగ్రీ కళాశాలలో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు మీడియా అకాడమీ కార్యదర్శి, జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ రెహమాన్, మేనేజర్, జిల్లా యూనియన్ అధ్యక్షులు రజనీకాంత్ కళాశాలకు చేరుకున్నారు.
సెమినార్ హాల్, లంచ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్ లను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లకు సంబంధించి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ కు పలు సూచనలు చేశారు.
వర్క్ షాప్ ను సద్వినియోగం చేసుకోవాలి
జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఉపయోగపడే ఈ శిక్షణ తరగతులను జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు సద్వినియోంచుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల్లో ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు హాజరై శిక్షణ ఇస్తారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 120 మంది జర్నలిస్టులకు అవకాశం ఉందని, వారికి మెటీరియల్, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.
వారి వెంట వర్క్ షాప్ నిర్వహణ కమిటీ సభ్యులు ఉన్నారు.








Post a Comment