కులమతాలకు అతీతంగా సేవలందిస్తూ 'ఊరికి ఉపకారి'గా నిలిచిన హైకోర్టు సీనియర్ లాయర్
పాల్గొన్న TUWJ IJU నాయకులు
లింగంపేట, సెప్టెంబర్ 24: లింగంపేట గడ్డపై బుధవారం సందడే సందడి. మండల కేంద్రంలోని తన ఫామ్ హౌస్ లో హైకోర్టు సీనియర్ న్యాయవాది మోహిన్ అహ్మద్ ఖాద్రి నిర్వహించిన గ్యార్వీ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.
సుమారు 5 వేల మందిని ఆహ్వానించి అతిథి మర్యాదల్లో ఎక్కడా లోటు రాకుండా చూసుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, పోలీసులు, పాత్రికేయులు ఈ వేడుకకు హాజరయ్యారు.
వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ ఖవ్వాలి గాయకులతో సంగీత విభావరి ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి TUWJ జిల్లా కార్యవర్గాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. TUWJ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ఉపాధ్యక్షులు యూనుస్, ఎలక్ట్రానిక్ మీడియా సహాయ కార్యదర్శి సలీం, DMAC సభ్యులు మొయిన్, జర్నలిస్టులు శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య, అబ్దుల్ అహ్మద్, అహ్మద్ మొహియొద్దీన్, సునీల్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేవలం పండగకే కాదు, ఊరికి ఉపకారి...
మోహిన్ అహ్మద్ ఖాద్రి అంటే లింగంపేట ప్రజలకు కేవలం ఒక లాయర్ కాదు, ఒక సేవకుడు. పుట్టిన ఊరి రుణం తీర్చుకునేలా తన సంపాదనలో సింహభాగాన్ని ఊరి అభివృద్ధికే ఖర్చు చేస్తున్నారు.
లింగంపేట, మెంగారం, ఐలాపూర్, లింగంపల్లి తదితర గ్రామాలకు చెందిన 400 మంది పేదలకు ప్రతి నెలా రూ.200 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. బతుకమ్మ, రంజాన్ పండుగలకు వందలాది మహిళలకు చీరలు, తోఫాలు పంచుతున్నారు.
దాహార్తిని తీర్చిన దాత:
"మంచినీళ్ల కోసం మా ఊరి జనం పడే కష్టం చూడలేకపోయా" అంటూ ఏకంగా 70 బోర్ బావులను తన సొంత డబ్బుతో తవ్వించారు. మోటార్లు, పైప్ లైన్లు వేసి ఇంటింటికి నీళ్లిచ్చారు.
గుడికి, బడికి, మసీదుకూ... అందరికీ ఆప్తుడు:
మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచిన మొయిన్
- ఉత్తర శబరిమల అయ్యప్ప మందిరానికి రూ.10 లక్షలు
- మత్తడి పోచమ్మ మందిరానికి రూ.10 లక్షలు
- రేణుక ఎల్లమ్మ మందిరానికి రూ.8 లక్షలు
- సంత్ సేవా లాల్ మందిరానికి రూ.5 లక్షలు
- హనుమాన్ ఆలయ పునరుద్ధరణకు రూ.4 లక్షలు
- మెంగారం మసీదు పునరుద్ధరణకు రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు.
అంతేకాదు, జెడ్పీ స్కూల్ కు బెంచీలు, జూనియర్ కాలేజీకి స్టేజి, గ్రామానికి రూ.5 లక్షలతో RO వాటర్ ప్లాంట్, రూ.20 లక్షలతో వైకుంఠ రథం సమకూర్చారు. జనవరిలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా 100 మందికి ఉచిత హెల్మెట్లు, మెగా రక్తదాన శిబిరం నిర్వహించి యువతకు ఆదర్శంగా నిలిచారు.
అందుకే లింగంపేట జనం ఆయన్ను ముద్దుగా "మనసున్న మానవతా వాది" అని, "ఊరికి ఉపకారి" అని పిలుచుకుంటున్నారు.







Post a Comment