ఉద్యమకారుల ఊసెత్తని కేకే కమిటీ.. ప్రభుత్వంపై మండిపడ్డ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చందు
బాన్సువాడ, సెప్టెంబర్ 18:
తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన మలిదశ ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సహాయక కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చందు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రభుత్వం తలుచుకుంటే ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడానికి ఎన్ని రోజులు పట్టదు. కానీ ఉద్యమకారుల విషయంలో మాత్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యమకారుల బతుకుల్లో వెలుగులు నింపాలని కోరారు.
రోజురోజుకూ ఎంతోమంది ఉద్యమకారులు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చేతగానితనమేనని ఆయన ఎద్దేవా చేశారు. కేకే కమిటీ కూడా ఉద్యమకారుల ఊసే ఎత్తకపోవడం బాధాకరమని అన్నారు.

Post a Comment