Top News

KNP Project | నిండుకుండలా కౌలాస్ నాలా ప్రాజెక్ట్ - గేట్లు ఎత్తే అవకాశం

నిండుకుండలా కౌలాస్ నాలా ప్రాజెక్ట్  - గేట్లు ఎత్తే అవకాశం

దిగువ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - నీటిపారుదల శాఖ హెచ్చరిక

జుక్కల్, సెప్టెంబర్ 23: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది.

ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 457.83 మీటర్లుగా నమోదు కాగా, గరిష్ట నిల్వ మట్టం 458.00 మీటర్లు. అంటే పూర్తిస్థాయి నీటిమట్టానికి కేవలం 0.17 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది.

పరివాహక ప్రాంతంలో వర్షాలు కొనసాగుతుండటంతో రాబోయే 24 గంటల్లో ఇన్‌ఫ్లోలు మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లోను బట్టి ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేయాల్సి రావచ్చని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులోకి లేదా వాగు పరిసరాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చేపలు పట్టేవారు, పశువుల, గొర్రెల కాపరులు, రైతులు వాగు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గేట్లు ఎత్తితే ముందస్తుగా ప్రత్యేక హెచ్చరిక ద్వారా సమయం, డిశ్చార్జ్ వివరాలు తెలియజేస్తామని నీటిపారుదల శాఖ, కౌలాస్ నాలా ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post