బాన్సువాడ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
వసతులు, విద్యా విధానం, భోజనం పరిశీలన - సంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్ గోపు గంగాధర్
బాన్సువాడ, సెప్టెంబర్ 17 : బాన్సువాడ పట్టణంలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ గురుకుల పాఠశాలను బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సందర్శించారు.
పాఠశాలలోని వసతులు, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫుడ్, పారిశుద్ధ్యం తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యత, వసతి గృహాలు, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ధనలక్ష్మి, బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు సుల్తానా గౌస్, వార్డు ఆఫీసర్ అరవింద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.




Post a Comment