కల్కి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
బాన్సువాడ: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను మున్సిపల్ కమీషనర్ కల్కి చెరువు వద్ద పర్యవేక్షించారు.
నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, లైటింగ్, పూల అలంకరణ పనులను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాధర్, కౌన్సిలర్లు రాజశేఖర్, హకీమ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment