Top News

Head Post Office Request |బాన్సువాడకు హెడ్ పోస్టాఫీస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి

బాన్సువాడకు హెడ్ పోస్టాఫీస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి

బిజెపి నేత కోనేరు శశాంక్ వినతికి సానుకూలంగా స్పందించిన మంత్రి 

బాన్సువాడ: బాన్సువాడ పట్టణానికి హెడ్ పోస్టాఫీస్ మంజూరు చేయాలని కోరుతూ బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.

శనివారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్, పోస్టల్ శాఖ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిని మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు శశాంక్, బాన్సువాడ ప్రాంత ప్రజలకు హెడ్ పోస్టాఫీస్ అవసరాన్ని వివరించారు.

బాన్సువాడ నియోజకవర్గం జనాభాపరంగా, వాణిజ్యపరంగా పెద్దదని, చుట్టుపక్కల మండలాల ప్రజలు పోస్టల్ సేవల కోసం ఇబ్బందులు పడుతున్నారని,  హెడ్ పోస్టాఫీస్ మంజూరు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ వినతిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, బాన్సువాడకు హెడ్ పోస్టాఫీస్ మంజూరు అంశాన్ని పరిశీలించి మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని కోనేరు శశాంక్ తెలిపారు.

బాన్సువాడ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీడియో 👇



Post a Comment

Previous Post Next Post