రేపు కామారెడ్డి బాయ్స్ స్కూల్ శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, ఎంపీ సురేష్ షట్కర్ రాక
నా పాఠశాలకు నా కృతజ్ఞత - ఆధునిక పాఠశాల నిర్మాణానికి శ్రీకారం: షబ్బీర్ అలీ ఆహ్వానం
కామారెడ్డి, సెప్టెంబర్ 14: తనకు విద్యాబుద్ధులు నేర్పిన కామారెడ్డి బాయ్స్ స్కూల్ శిథిలావస్థకు చేరడం తన మనసును కలచివేసిందని, దానిని ఆధునిక పాఠశాలగా తీర్చిదిద్దేందుకు సంకల్పించానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు సమకూర్చడంతో పాటు, తన సొంత నిధులు కూడా అందించి పాఠశాలను ఆధునిక హంగులతో పునర్నిర్మించనున్నట్లు తెలిపారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యే ఈ శంకుస్థాపన కార్యక్రమం రేపు, సెప్టెంబర్ 15 ఉదయం 10 గంటలకు కామారెడ్డి బాయ్స్ స్కూల్‌లో జరగనుంది.
గురువులు, సహచర విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, జిల్లా ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని షబ్బీర్ అలీ ప్రత్యేక ఆహ్వానం పలికారు.

Post a Comment