Top News

MLA PSR | జాతీయ సమైక్యతా సదస్సులో పాల్గొనాలని ఎమ్మెల్యే పోచారం పిలుపు

బాన్సువాడలో జాతీయ సమైక్యతా సదస్సులో పాల్గొనాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపు

బాన్సువాడ, సెప్టెంబర్ 24: బాన్సువాడలో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా సదస్సు (ఖౌమీ ఏక్తా కాన్ఫరెన్స్)ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

సదస్సు నిర్వాహకులు గురువారం ఎమ్మెల్యేను కలిసి సదస్సు వివరాలను తెలిపి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జాతీయ సమైక్యతను చాటే ఈ సదస్సులో నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదరస అబ్దుల్లా బిన్ అబ్బాస్ నిర్వాహకులు ముఫ్తి ఉమర్ బిన్ ఈసా, షాదీ ఖానా చైర్మన్ హఫెజ్ వహాబ్, అఫ్రోజ్, నవీద్ పాల్గొన్నారు.

సదస్సు వివరాలు:

- వేదిక: మార్కెట్ యార్డ్ గంజ్, బాన్సువాడ

- తేదీ: 27 సెప్టెంబర్ 2026, ఆదివారం

- సమయం: సాయంత్రం 7 గంటలకు

ఈ సదస్సుకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post