Top News

Peace Committe | వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలని డీఎస్పీ పిలుపు

వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలని డీఎస్పీ పిలుపు

బాన్సువాడలో వినాయక చవితి శాంతి కమిటీ సమావేశం 

బాన్సువాడ, సెప్టెంబర్ 04: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని డీఎస్పీ విఠల్ రెడ్డి సూచించారు.

బాన్సువాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో వినాయక మండపాల నిర్వాహకులు, వివిధ మత పెద్దలు, పట్టణ ప్రముఖులు, వివిధ శాఖల అధికారులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం డీఎస్పీ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో, పట్టణ సీఐ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల్లో పోలీస్ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయరాదని, నిర్ణీత సమయాలు పాటించాలని, ధ్వని కాలుష్య నిబంధనలు గౌరవించాలని సూచించారు. సోషల్ మీడియాలో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అలాంటి వాటిని నమ్మవద్దని హెచ్చరించారు.

ఊరేగింపులు, నిమజ్జన సమయంలో పోలీసులకు సహకరించాలని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రజలందరూ ఐకమత్యంతో, పరస్పర గౌరవంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించి బాన్సువాడ ప్రతిష్ఠను కాపాడాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని వర్గాల పెద్దలు, మండప నిర్వాహకులు ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.





Post a Comment

Previous Post Next Post