నిమ్స్‌లో వైద్యానికి రూ.5 లక్షల ఎల్వోసీ అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
నిజామాబాద్, సెప్టెంబర్ 04:
నియోజకవర్గంలో పేదలకు నిమ్స్‌లో ఉచిత వైద్యం అందేలా ఎల్వోసీలు అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.
శుక్రవారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వర్ని రోడ్ కు చెందిన సుధీర్ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎల్వోసీని అందజేశారు. సుధీర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, నిమ్స్‌లో చికిత్స కోసం ఈ ఎల్వోసీ మంజూరు చేయించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నానని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
అలాగే హైదరాబాద్‌లోని బీబీనగర్ ఎయిమ్స్‌లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన పేదలు ఎయిమ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Post a Comment