ఖురాన్ పరీక్షల్లో ఫత్లపూర్ మదర్సా విద్యార్థుల ప్రతిభ - 600 మందిలో టాప్ 3 స్థానాలు కైవసం
నిజామాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మదర్సాల్లో నిర్వహించిన ఖురాన్ పఠనం, జ్ఞానానికి సంబంధించిన పరీక్షల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఫత్లపూర్ మదర్సా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
ఈ పరీక్షల్లో వివిధ మదర్సాల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనగా, ఫత్లపూర్ మదర్సాకు చెందిన ముగ్గురు విద్యార్థులు 1వ, 2వ, 3వ స్థానాల్లో నిలిచి సత్తా చాటారు. ఇది మదర్సాకే కాక గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
విద్యార్థులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఫత్లపూర్ మదర్సా ప్రాంగణంలో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మత పెద్దలు మరియు ప్రముఖుల చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షీల్డులు అందజేసి ఘనంగా సన్మానించారు.
విద్యార్థుల విజయానికి కృషి చేసిన మదర్సా నిర్వాహకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను గ్రామ పెద్దలు అభినందించారు. చిన్న వయసులోనే ఖురాన్ విద్యలో ప్రతిభ కనబరుస్తూ మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Post a Comment