Top News

Theft Case | కామారెడ్డి జిల్లాలో ఆలయ చోరీ కేసు ఛేదింపు

కామారెడ్డి జిల్లాలో ఆలయ చోరీ కేసు ఛేదింపు 

నిందితుడి అరెస్ట్, రూ.75 వేల ఆభరణాలు స్వాధీనం

కామారెడ్డి, సెప్టెంబర్ 13: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పీరమాయికుంట తండా గ్రామ శివారులోని దుర్గామాత  సేవాలాల్ ఆలయాల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

ఫిర్యాదుదారుడు నునావత్ నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సెప్టెంబర్ 9 రాత్రి ఆలయాల తాళాలు పగులగొట్టి అర తులం బంగారు ముక్కుపుడక, ఒక తులం వెండి ముక్కుపుడక, అర తులం బంగారు పుస్తెల జత, 30 తులాల వెండి గొలుసు మొత్తం సుమారు రూ.75,000 విలువైన ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో, సదాశివనగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ వీరయ్య, తాడ్వాయి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పరిశీలన, సాంకేతిక పరిజ్ఞానం మరియు గ్రామస్తుల సమాచారంతో నిందితుడిని గుర్తించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పీరమాయికుంట / పల్లెగడ్డ తండాకు చెందిన A-1 జాదవ్ ప్రేమదాస్ (26), తండ్రి విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

నిందితుడు దాచిన చోరీ సొత్తుతో పాటు నేరానికి ఉపయోగించిన 20 అంగుళాల ఇనుప రాడ్డును పోలీసులు పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

కేసును త్వరితగతిన ఛేదించిన సదాశివనగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ వీరయ్య, తాడ్వాయి ఎస్ఐ నరేష్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Post a Comment

Previous Post Next Post