Top News

Seminar Postponed | బాన్సువాడ జాతీయ సమైక్యతా సదస్సు వాయిదా

బాన్సువాడ జాతీయ సమైక్యతా సదస్సు వాయిదా 

సెప్టెంబర్ 27న జాతీయ సమైక్యతా సదస్సు 

బాన్సువాడ, సెప్టెంబర్ 11: బాన్సువాడ కోయగట్టలోని మదరసా అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి) ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన మహత్తర జాతీయ సమైక్యతా సదస్సు తేదీ మార్పు చేసినట్లు నిర్వాహకులు ముఫ్తి ఉమర్ బిన్ ఈసా ప్రకటించారు.

ఇదివరకు సెప్టెంబర్ 16, 2026న జరగాల్సిన సదస్సు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు. హిందూ మిత్రుల పండుగ దృష్ట్యా, పోలీసు శాఖ సూచనలు, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కొత్త తేదీ సెప్టెంబర్ 27, 2026 ఆదివారం నాడు సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని మతాలు, వర్గాల ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చారిత్రాత్మక సమావేశంలో పాల్గొనేలా తేదీ మార్చామని నిర్వాహకులు తెలిపారు.

శాంతి, సోదరభావం, పరస్పర ప్రేమ, మత సామరస్యం మరియు జాతీయ సమైక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 16న కాకుండా సెప్టెంబర్ 27న జరిగే సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మత పెద్దలు, రాజకీయ, సామాజిక ప్రముఖులు, మేధావులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post