Top News

Govardhini Goshala |గోమయంతో తయారు చేసిన పర్యావరణ హిత గణేష్ విగ్రహాలను అందజేసిన గోవర్ధిని గోశాల



గోమయంతో తయారు చేసిన పర్యావరణ హిత గణేష్ విగ్రహాలను అందజేసిన గోవర్ధిని గోశాల

బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ కు అందజేత

బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో గోవర్ధిని గోశాల ఆధ్వర్యంలో ఆవు పేడ (గోమయం)తో సహజసిద్ధంగా తయారు చేసిన పర్యావరణహిత గణేష్ విగ్రహాలను అధికారులకు అందజేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గోమయంతో తయారు చేసిన విగ్రహాలను బాన్సువాడ మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, విద్యుత్ శాఖ AE గారికి అందజేశారు. అలాగే బాన్సువాడ మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు కూడా పాల్గొని గోమయ ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు.

ఆవు పేడను కేవలం వ్యర్థంగా కాకుండా సహజ వనరుగా, పర్యావరణహిత ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడే విలువైన పదార్థంగా ప్రజలకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గోశాల నిర్వాహకులు తెలిపారు. Video 👇


గోవర్ధిని గోశాల ఆధ్వర్యంలో గోమయంతో విగ్రహాలు, అలంకరణ వస్తువులు మరియు ఇతర పర్యావరణహిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తూ, గో ఆధారిత ఉపాధి అవకాశాలను పెంపొందించడం, గోశాలలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని వారు పేర్కొన్నారు.

గోమయ వినియోగం ద్వారా గోశాలలకు అదనపు ఆదాయం కల్పించడంతో పాటు స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని గోశాలను ప్రోత్సహించిన బాన్సువాడ మున్సిపల్ చైర్పర్సన్ కాసుల విజయ బాలరాజు, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్,కౌన్సిలర్ ఎండి ఖాలేక్, కొ ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, లైఖ్, మహ్మద్ గౌస్,భాస్కర్ రెడ్డి,విద్యుత్ శాఖ AE,  కౌన్సిలర్లకు గోవర్ధిని గోశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post