Top News

SIR Hearings | నోటీసులు అందిన వారికి అవగాహన కల్పించిన అధికారులు

SIR లో భాగంగా టీచర్స్ కాలనీలో హియరింగ్

నోటీసులు అందిన వారికి అవగాహన కల్పించిన అధికారులు

షెడ్యూల్ ప్రకారం డాక్యుమెంట్లు అందించాలని సూచన

బాన్సువాడ, సెప్టెంబర్ 07:

ఎస్.ఐ.ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా కామారెడ్డి టీచర్స్ కాలనీ బూత్ నంబర్ 225 లో నోటీసులు అందిన వారికి హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు.

బీఎల్ఓలు సూచించిన పత్రాలతో వచ్చిన ఓటర్ల వివరాలను పరిశీలించి హియరింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరై మాట్లాడుతూ.. ఎస్.ఐ.ఆర్ లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు తమ అవసరమైన డాక్యుమెంట్లను షెడ్యూల్ ప్రకారం అందించాలని, లేనిపక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రతి ఒక్కరూ స్పందించాలని పేర్కొన్నారు.

అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ హాజరై నోటీసులు అందిన వారికి అవగాహన కల్పించారు. ఓటర్ జాబితా సవరణలో అందరూ సహకరించాలని, సరైన పత్రాలతో హాజరై వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాలిక్, కో ఆప్షన్ సభ్యులు కమర్ సుల్తానా గౌస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్, బీఎల్ఓ కపిల్ వాణి, మున్సిపల్ సిబ్బంది పవన్, అజీమ్, గోపాల్ రెడ్డి, ప్రదీప్ పటేల్, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post