బాన్సువాడ కోటగల్లి కాలనీలో ఇండ్లపై రాళ్ల దాడులు..!
వారం రోజులుగా కొనసాగుతున్న ఘటనలు - భయాందోళనలో కాలనీవాసులు
బాన్సువాడ, సెప్టెంబర్ 01:
బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి కాలనీలో వారం రోజులుగా ఇళ్లపై రాళ్లు పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.
రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు వేస్తున్నారనే ఆరోపణలతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఉన్న కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సీఐ తుల శ్రీధర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి, రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఘటనల వెనుక ఎవరున్నారనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment