సంతానోత్పత్తి శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుధారాణి, డాక్టర్ విజయ్
ఆవులు, గేదెలకు గర్భధారణ పరీక్షలు, కృత్రిమ గర్భధారణ సేవలు
బైరాపూర్ (నసరుల్లాబాద్) :
బైరాపూర్ గ్రామంలో మంగళవారం పశువుల సంతానోత్పత్తి (ఫెర్టిలిటీ) శిబిరాన్ని నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ పి. సుధారాణి, మండల పశువైద్యాధికారి డాక్టర్ విజయ్ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ మాట్లాడుతూ.. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యకరమైన పశుసంపద కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు.
ఈ శిబిరంలో ఆవులు, గేదెల గర్భధారణ పరీక్షలు, సంతానోత్పత్తి సమస్యల నిర్ధారణ, కృత్రిమ గర్భధారణ సేవలు, రుతుచక్ర, ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు, చికిత్సలు అందించారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, స్థానిక పశుపోషకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment