బాన్సువాడలో రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతులు -TUWJ(IJU), తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ
సెప్టెంబర్ 29, 30 తేదీలలో శిక్షణ - ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారుల పోచారం శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
ఫేక్ న్యూస్, AI, సైబర్ క్రైమ్, RTI చట్టంపై ప్రత్యేక క్లాసులు - జిల్లా కలెక్టర్, ఎస్పీతో ముఖాముఖి
కామారెడ్డి, సెప్టెంబర్ 21: తెలంగాణ మీడియా అకాడమీ (MATG), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ, IJU) సంయుక్త సహకారంతో కామారెడ్డి జిల్లా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం సెప్టెంబర్ 29, 30 తేదీలలో బాన్సువాడలోని రెడ్డి సంఘం భవనం, తాడ్కోల్లో జరగనుందని మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్ రావు తెలిపారు.
ప్రారంభోత్సవం - సెప్టెంబర్ 29 మంగళవారం :
ఉదయం 10.00 గంటల నుండి 12.00 గంటల వరకు ప్రారంభ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించనుండగా, బాన్సువాడ శాసన సభ్యులు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మొదటి రోజు (29.09.2026) శిక్షణా అంశాలు:
- మధ్యాహ్నం 12.00 - 1.10 వరకు: సీనియర్ జర్నలిస్ట్, RTI మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి - సమాచార హక్కు చట్టం - 2005 - జర్నలిస్టులకు బోధన అనే అంశంపై అవగాహన కల్పిస్తారు.
- మధ్యాహ్నం 1.15 - 2.00 వరకు: భోజన విరామం
- మధ్యాహ్నం 2.00 - 3.10 వరకు: సీనియర్ జర్నలిస్ట్ గోవింద రెడ్డి - నేర వార్తలు - చేయాల్సినవి, చేయకూడనివి పై క్లాస్.
- మధ్యాహ్నం 3.10 - 4.20 వరకు: దిశ ఎడిటర్ మార్కండేయ - వార్తా కథనాలు / ప్రత్యేక కథనాలు పై శిక్షణ.
- సాయంత్రం 4.20 - 5.30 వరకు: సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ ముద్దం నరసింహ స్వామి - ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, AI, సోషల్ మీడియా పై కీలక సూచనలు.
రెండవ రోజు (30.09.2026 బుధవారం) శిక్షణా అంశాలు:
- ఉదయం 10.00 - 11.10 వరకు: మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి - మీడియా -చట్టాలు - నైతిక నియమావళి పై తరగతి.
- ఉదయం 11.10 - 12.20 వరకు: సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఆర్. ఉమామహేశ్వరరావు - భాష - తప్పొప్పులు, దిద్దుబాట్లు పై.
- మధ్యాహ్నం 12.20 - 1.30 వరకు: సీనియర్ జర్నలిస్ట్ తోట భవనారాయణ - గ్రామీణ వార్తలు - ఎలక్ట్రానిక్ మీడియా పై.
- మధ్యాహ్నం 1.30 - 2.00 వరకు: భోజన విరామం
- మధ్యాహ్నం 2.00 - 3.10 వరకు: Team International Justice Mission - కె. ముత్తయ్య - మానవ అక్రమ రవాణా - బాలల వెట్టి చాకిరీ నిర్మూలన పై అవగాహన.
- సాయంత్రం 3.10 - 4.20 వరకు: జిల్లా కలెక్టర్ / ఎస్పీ / జాయింట్ కలెక్టర్ / సీఈవో అధికారులతో ముఖాముఖి కార్యక్రమం - జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పై చర్చ.
ముగింపు కార్యక్రమం:
సాయంత్రం 4.30 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హాజరుకానున్నారు. సభాధ్యక్షులుగా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారు.
కామారెడ్డి జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ శిక్షణా తరగతులకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కార్యదర్శి, తెలంగాణ మీడియా అకాడమీ, హైదరాబాద్ ఒక ప్రకటనలో తెలిపారు.



Post a Comment