Praja Vani | ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు - అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు

కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి - 68 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 భూ సమస్యలు, పింఛన్లు, సంక్షేమ పథకాలపై ఫిర్యాదులు 

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు - అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు 

కామారెడ్డి, సెప్టెంబర్ 21:కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 68 దరఖాస్తులను స్వీకరించారు.

జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలు ప్రజావాణికి హాజరై తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. భూ సమస్యలు, రెవెన్యూ, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సకాలంలో న్యాయం అందేలా చూడాలని సూచించారు.

ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, సీఈఓ చందర్, డిప్యూటీ శిక్షణ కలెక్టర్ రవితేజ, డీఆర్ఓ పాండు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post