అంబేద్కర్ చౌరస్తాలో దద్దరిల్లిన గణేష్ నినాదాలు - డీజే, లైటింగ్ తో అదిరిన ఊరేగింపు
బాన్సువాడ : ఆదివారం రాత్రి మణికంఠ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మహారాజ్ స్వాగత కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గణేష్ ఆగమన్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఊరేగింపులో రంగు రంగుల విద్యుత్ దీపాలు, డీజే సౌండ్ సిస్టమ్, రాహుల్ ప్యాడ్ బ్యాండ్, సంప్రదాయ మేళతాళాలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన గొడుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాది మంది యువకులు డీజే సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ "జై బోలో గణేష్ మహారాజ్ కీ జై" అంటూ నినాదాలు చేశారు.
అనంతరం భారీ గణేష్ విగ్రహానికి తెర తొలగించి స్వాగతం పలికారు. గణేష్ విగ్రహాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఫోటోలు, వీడియోలు తీశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ శ్రీధర్, నిర్వాహకులు,పుర ప్రముఖులు మామిండ్ల రాజు, కొత్తకొండ భాస్కర్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కార్యక్రమం దద్దరిల్లింది.










Post a Comment