10+2 School Sanction | బాన్సువాడలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

బాన్సువాడలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

టెన్ ప్లస్ టూ విధానంలో నూతన భవనం - ఎమ్మెల్యే పోచారం ఆదేశాలతో అధికారుల పర్యటన

బాన్సువాడ, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టెన్ ప్లస్ టూ విధానంలో భాగంగా, బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కాలేజీని విలీనం చేస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) భవన నిర్మాణానికి మంజూరు అయింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ తో ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట విద్య అందించే విధంగా చేపట్టనున్న భవన నిర్మాణ పనులను పరిశీలించేందుకు అధికారులు బాన్సువాడకు విచ్చేశారు.

బాన్సువాడ నియోజకవర్గంలో TPS మంజూరు కావడంతో, ప్రభుత్వ సలహాదారులు,మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు స్థలాన్ని పరిశీలించారు. స్వయంగా పోచారం అధికారులకు స్థలం చూయించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎర్వల కృష్ణారెడ్డి,కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్, కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్, TPS డిపార్ట్మెంట్ నుంచి ఈఈ రవీందర్, డీఈ సుబ్బారావు, నరహరి తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.






Post a Comment

Previous Post Next Post