మేస్త్రీ పనికి వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు కుమార్తెలకు దూరమైన తండ్రి
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికుల ఆరోపణ
బాన్సువాడ, అక్టోబర్ 30: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ మండలం కొత్త బాది గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ (40) మేస్త్రీ పనుల నిమిత్తం బుడిమి గ్రామానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహేష్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి చెందడంతో భార్య, పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.
కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడియో 👇

Post a Comment