బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి - జడ్జి జాడ వినీల్ కుమార్
బోర్లమ్ ప్రభుత్వ పాఠశాలలో సురక్షిత బచ్పన్ అభియాన్ అవగాహన సదస్సు
పోక్సో, బాల్య వివాహ చట్టం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ భద్రతపై అవగాహన
రుద్రంగి అశోక్ /బాన్సువాడ, అక్టోబర్ 30: బాలల హక్కుల రక్షణ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవ శ్రీ జాడ వినీల్ కుమార్ అన్నారు.
శుక్రవారం బోర్లమ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సురక్షిత బచ్పన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, భద్రత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న బాలలు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 ను సంప్రదించాలని సూచించారు. బాలికలకు చట్టపరమైన రక్షణ వివరించే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ కుమార్, సీనియర్ అడ్వకేట్లు హమీద్, అర్షద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, పారాలీగల్ వాలంటీర్ అయ్యల సంతోష్, ఉపాధ్యాయ బృందం, కోర్టు సిబ్బంది లక్ష్మణ్, ఫారుక్, చక్రవర్తి పాల్గొన్నారు.

Post a Comment