Gayatri Sugars | నిజాంసాగర్‌లో 2026-27 చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభం

నిజాంసాగర్‌లో 2026-27 చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభం

గాయత్రి చక్కెర కర్మాగారంలో పూజలు నిర్వహించిన యాజమాన్యం

10,700 ఎకరాల్లో పంట, 4.25 లక్షల టన్నుల క్రషింగ్ లక్ష్యం

నిజాంసాగర్, అక్టోబర్ 30:  నిజాంసాగర్ మండలంలోని మాగి శివారులోని గాయత్రి చక్కెర కర్మాగారంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన చెరకు క్రషింగ్ ను శుక్రవారం ప్రారంభించినట్లు సంస్థ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు.

ఈ సంవత్సరం 10,700 ఎకరాల్లో చెరకు పండించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం 4.25 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేయనున్నట్లు అంచనా వేశారు.

ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ షాదుల్లా, కేన్ జీఎం వెంగల్ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, సుగుణభూషణ్ రావ్, గోవింద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post