Bakeries Inspection | బాన్సువాడలో స్వీట్ షాపులు, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

బాన్సువాడలో స్వీట్ షాపులు, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న దుకాణాలు గుర్తింపు - నోటీసులు జారీ

అనుమానాస్పద ఆహార నమూనాలు ల్యాబ్ కు తరలింపు: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విక్రమ్

బాన్సువాడ, 16 అక్టోబర్: బాన్సువాడ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ G. విక్రమ్ ఆధ్వర్యంలో స్వీట్ షాపులు, బేకరీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. భారతీయ స్వీట్లు మరియు బేకరీ ఉత్పత్తులపై ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు.

తనిఖీల సందర్భంగా పలు ఆహార వ్యాపార సంస్థలు FSSAI రిజిస్ట్రేషన్ / లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అలాగే పలు పరిశుభ్రత లోపాలు కూడా గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ఆహార నమూనాలను అక్కడికక్కడే సేకరించి విశ్లేషణ నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు.

పరిశుభ్రత పాటించని,  FSSAI లైసెన్స్ లేని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. ప్రజలు పరిశుభ్రత పాటించే దుకాణాల నుండి మాత్రమే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసే ముందు లేబుల్స్ సరిగ్గా చదవాలని అధికారులు సూచించారు.

Post a Comment

Previous Post Next Post