కామారెడ్డిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం
ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ - బ్లడ్ బ్యాంక్ కు స్థలం కేటాయిస్తామని హామీ
రాష్ట్రంలో సభ్యత్వ నమోదులో రెండో స్థానంలో కామారెడ్డి బ్రాంచ్
కామారెడ్డి, 16 అక్టోబర్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని IDOC మీటింగ్ హాల్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన జిల్లా మేనేజ్ మెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. జిల్లా కలెక్టర్ /రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా రెడ్ క్రాస్ సొసైటీ అద్భుతమైన సేవలు అందిస్తోందని కొనియాడారు. నూతన టీమ్ కృషితో కామారెడ్డి జిల్లా బ్రాంచ్ రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వ నమోదుతో రెండో స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నషా ముక్త్ భారత్, టీబీ ముక్త్ భారత్ వంటి కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ చురుగ్గా పాల్గొనాలని సూచించారు.
నూతన చైర్మన్ గా డాక్టర్ ఎం. సంజీవరెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్ గా డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గా దస్తిరాం, ట్రెజరర్ గా రమేష్ రెడ్డి, మాజీ చైర్మన్ రాజన్నతో పాటు డిస్ట్రిక్ట్ ఎంసీ మెంబర్లు నాగరాజు గౌడ్, కృష్ణ, గోవర్ధన్, సదాశివరెడ్డి, శ్రీధర్ జోషి, శ్రీకాంత్, దత్తాత్రి, కిరణ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు విక్టర్, గిరి, లేబర్ ఆఫీసర్ శశికుమార్, ఎలక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ రెడ్డి, డీఈవో మల్లికార్జున్, డీఎం&హెచ్ఓ డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment