కల్కి చెరువు వద్ద ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్
రుద్రంగి అశోక్/బాన్సువాడ, అక్టోబర్ 9:
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు స్థానిక కల్కి చెరువు కట్ట వద్దకు వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ బాలరాజ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు.
విద్యార్థులు బతుకమ్మలను సురక్షితంగా గంగమ్మ గుడి వద్దకు తీసుకెళ్లేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసి, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలతో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పండుగ సంబరాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, మున్సిపల్ సిబ్బంది సహకారంతో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.



Post a Comment