బిచ్కుంద మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లక్కీ డ్రా
90 దరఖాస్తులు - ఎల్లారెడ్డికి చెందిన అతినారపు భైరవ స్వామి విజేత
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి
కామారెడ్డి, 16 అక్టోబర్: కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.
నూతన బార్ కేటాయింపునకు మొత్తం 90 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఆబ్కారీ అధికారి బి. ముకుంద రెడ్డి తెలిపారు. లక్కీ డ్రా ద్వారా ఎల్లారెడ్డికి చెందిన అతినారపు భైరవ స్వామి విజేతగా నిలిచారని, టోకెన్ నంబర్ 1కు బార్ కేటాయింపు లభించిందని వెల్లడించారు.



Post a Comment