టీచర్స్ కాలనీ దుర్గామాత ఆలయం వద్ద అన్నదానం
డీఎస్పీ విఠల్ రెడ్డి హాజరు - దుర్గామాతను దర్శించుకున్న డీఎస్పీ
బాన్సువాడ, 16 అక్టోబర్: బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ దుర్గామాత ఆలయం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి హాజరై దుర్గామాతను దర్శించుకున్నారు. వారితో పాటు రూరల్ సీఐ తిరుపతయ్య, మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు సుల్తానా గౌస్, కాలనీవాసులు జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment