BJP Leader Paidimal's Visit | శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన.. కార్యకర్త కుటుంబానికి పరామర్శ

అంబం గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ పర్యటన

SIR పై దుష్ప్రచారంపై గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరణ

శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన.. కార్యకర్త కుటుంబానికి పరామర్శ

రుద్రంగి అశోక్/బాన్సువాడ :

అంబం గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా SIR (Special Intensive Revision) పై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి గ్రామ ప్రజలను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని గ్రామస్తులకు సూచించారు.

అనంతరం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన చేపట్టారు. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించి స్థానికులతో చర్చించారు. త్వరలో విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలాగే వారం రోజుల క్రితం మరణించిన బీజేపీ కార్యకర్త మంత్రి లింగం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post