బాన్సువాడలో కాంగ్రెస్ ధర్నా - సీఈసీ దిష్టిబొమ్మ దహనం
బాన్సువాడ, అక్టోబర్ 8: ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీ పిలుపు మేరకు బాన్సువాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఈ ధర్నా చేపట్టారు. వీడియో 👇
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ, ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ను పార్లమెంటులో అభిశంసన తీర్మానం చేసి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దిష్టిబొమ్మను దహనం చేశారు. "బీజేపీ డౌన్ డౌన్.. సీఈసీ రాజీనామా చేయాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలీ బిన్ అబ్దుల్లా, మహ్మద్ ఏజాజ్, కాసుల రోహిత్, ఎర్వల కృష్ణారెడ్డి, అసద్ బిన్ మోసిన్, మహ్మద్ గౌస్, షేక్ అజీమ్, కాసోజీ నర్సన్న, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






Post a Comment