MLA PSR | ఖమర్ సుల్తానా గౌస్ ను పరామర్శించిన పోచారం

బాన్సువాడ కో-ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ ను పరామర్శించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, అక్టోబర్ 8: బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ ని బాన్సువాడ శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు పరామర్శించారు.

గౌస్  తండ్రి స్వర్గస్తులయ్యారని తెలుసుకున్న వెంటనే ఆయన సుల్తానా గౌస్  నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని ఓదార్చి మనోధైర్యం చెప్పారు.

ఈ పరామర్శలో ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, టౌన్ సీఐ తుల శ్రీధర్, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, అలీముద్దీన్ బాబా, బోర్లం శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post