Cyber Crimes | సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం - కామారెడ్డి పోలీసుల అవగాహన

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం - కామారెడ్డి పోలీసుల అవగాహన

విద్యార్థులతో సైబర్ జాగ్రూకత దివస్ - మోసాలపై ప్రచారం 

కామారెడ్డి, అక్టోబర్ 7: సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సైబర్ క్రైమ్ ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహారెడ్డి సైబర్ నేరాల అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.

పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఆన్ లైన్ షాపింగ్, నకిలీ పరిచయాలు, రుణాల పేరుతో జరిగే మోసాలపై విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని, http://www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.




Post a Comment

Previous Post Next Post