బాన్సువాడలో కాసుల బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా అలై బలై ఆత్మీయ సమ్మేళనం
ముస్లిం సోదరులు, వివిధ పార్టీల నేతలతో కలిసి విందులో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్
ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెంచేదే అలై బలై: నేతలు
బాన్సువాడ, 18 అక్టోబర్: దసరా పండగను పురస్కరించుకుని మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం బాన్సువాడ పట్టణంలోని కొయ్యగుట్ట సమీపంలో అలై బలై ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతిలో అలై బలైకి ఉన్న ప్రత్యేకతను చాటుతూ నిర్వహించిన ఈ సమ్మేళనంలో హిందూ, ముస్లిం సోదరులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, యువకులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ హాజరయ్యారు. వారికి కాసుల బాలరాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు అందరితో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, సోదరభావం, మత సామరస్యం పెరుగుతుందని అన్నారు. తెలంగాణ గడ్డపై అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జరుపుకునే పండుగే అలై బలై అని, కాసుల బాలరాజు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఐక్యతను చాటుతున్నారని కొనియాడారు.
కాసుల బాలరాజు మాట్లాడుతూ బాన్సువాడలో అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండటమే తమ బలమని, దసరా పండుగ సందర్భంగా అందరినీ ఒకచోట చేర్చి ఆత్మీయతను పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ విందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసుల రోహిత్, అలీబిన్ అబ్దుల్లా, ఎర్వలా కృష్ణారెడ్డి, గురు వినయ్ కుమార్, మహ్మద్ ఏజాస్, షేక్ అజీమ్,మహ్మద్ కాలిక్, మహ్మద్ గౌస్, అబ్దుల్ వహాబ్, రెంజర్ల సాయిలు, సురేష్, నార్ల నందకిశోర్, నార్ల రవీందర్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







Post a Comment