Mala Sangham | SC వర్గీకరణ రోస్టర్ లో మాలలకు తీవ్ర అన్యాయం

SC వర్గీకరణ రోస్టర్ లో మాలలకు తీవ్ర అన్యాయం: అయ్యాల సంతోష్

రోస్టర్ సవరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం: మాల సంఘాల హెచ్చరిక

కామారెడ్డి, 18 అక్టోబర్: కామారెడ్డి పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ లో ఆదివారం మాలల వివిధ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన SC వర్గీకరణ వల్ల వచ్చిన రోస్టర్ విధానం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇచ్చిన దాదాపు 23 నోటిఫికేషన్లలో 16 నోటిఫికేషన్ల వరకు మాలలకు ఒక్క పోస్టు కూడా రాలేదన్నారు.

రోస్టర్ లో 22వ పాయింట్ లో మాలలను పెట్టడం వల్ల విద్యా, ఉద్యోగ, ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని, రోస్టర్ లో 10 పాయింట్ లోపు మాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రోస్టర్ ను సవరించాలి లేదా రద్దు చేయాలి, లేకపోతే రాబోయే రోజుల్లో మాలలకు మద్దతుగా నిలిచే పార్టీలకే ఓటు వేస్తామని హెచ్చరించారు.

జిల్లాలోని వివిధ మాల సంఘాల నాయకులు మండల కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు, MRO లకు వినతిపత్రాల ద్వారా తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో MCF కన్వీనర్ ధర్మపురి, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్, రాజలింగం, లింగాపూర్ రాజు, సంగి విజయ్, గంగాధర్, బత్తుల స్వామి, N. స్వామి, నాంపల్లి సాయి మౌర్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post