Death in Pond | చెరువులో మునిగి దీక్షాపరుడి మృతి

బాన్సువాడలో విషాదం - చెరువులో మునిగి దీక్షాపరుడి మృతి

బాన్సువాడ , అక్టోబర్ 13: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. దుర్గామాత దీక్షలో ఉన్న వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందారని పోలీసులు తెలిపారు.

గ్రామానికి చెందిన సున్నపు శ్రీకాంత్ (30), తండ్రి సాయిలు, కూలి పని చేస్తుంటాడు. అక్టోబర్ 12న తనతో పాటు దీక్ష తీసుకున్న ఇతర స్వాములతో కలిసి ఊర చెరువు వద్ద గల గంగమ్మ గుడి సమీపంలో స్నానానికి వెళ్లాడు.

అందరూ చెరువులో స్నానం చేస్తుండగా చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో శ్రీకాంత్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు.

మృతుడి భార్య సున్నపు సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెరువులు, కుంటల్లో స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లోతు తెలియని ప్రదేశాల్లోకి దిగవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post