Enugu Ravindar Reddy | జర్నలిస్టు ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు

జర్నలిస్టు ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు

రష్యా ఆర్మీలో చిక్కిన అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన ఏనుగు

తిమ్మాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు

బాన్సువాడ, అక్టోబర్ 21: కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బుధవారం నాడు బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించారు.

తిమ్మాపూర్‌లో ప్రత్యేక పూజలు

మొదట బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బాన్సువాడకు చేరుకున్న ఆయన కోటగల్లీలో గల దుర్గమ్మ ఆలయంలో పూజలు చేశారు.

అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన ఏనుగు

అక్కడి నుంచి తాడ్కోల్‌లో రష్యా ఆర్మీలో చిక్కుకొని చనిపోయినట్లు వార్తలు వస్తున్న అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని ఏనుగు రవీందర్ రెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ తండ్రి మాట్లాడుతూ, అఫ్జల్ ఖాన్‌తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురిని బలవంతంగా రష్యా ఆర్మీలో పంపి ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపారని తెలిపారు. తన కుమారుడు అఫ్జల్ ఖాన్ చనిపోయినట్లు తోటి మిత్రుడు అశోక్ వాయిస్ మెసేజ్ పంపారని, దీంతో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఇప్పటికీ ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన ఏనుగు రవీందర్ రెడ్డి, ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

జర్నలిస్టు వైవీ ప్రసాద్ కుటుంబానికి పరామర్శ 

అనంతరం అక్కడి నుంచి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు వైవీ ప్రసాద్ కుటుంబాన్ని జర్నలిస్ట్ కాలనీకి వెళ్లి పరామర్శించారు.

ప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రసాద్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, కొత్తకొండ భాస్కర్, కిషోర్ యాదవ్, గణేష్, యూనుస్, నందు తదితరులు ఉన్నారు.


Advt 


Post a Comment

Previous Post Next Post