కామారెడ్డి, అక్టోబర్ 6: జాతీయ రహదారి-44 వెంట ఉన్న ఆహార సంస్థల్లో టీజీ సేఫ్ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) అధికారులు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 10 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మొత్తం 20 ఆహార సంస్థలను తనిఖీ చేయగా, కామారెడ్డి జిల్లాలో 8 రెస్టారెంట్లను తనిఖీ చేశారు.
తనిఖీల్లో తీవ్ర ఉల్లంఘనలు గుర్తించిన 6 రెస్టారెంట్ల లైసెన్సులను సస్పెండ్ చేసి, వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.
లైసెన్సులు సస్పెండ్ అయిన హోటళ్లు:
- జైకా మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, బస్వాపూర్
- ది మాల్గుడి రెస్టారెంట్, అంతంపల్లి (భిక్నూర్)
- వసుధ ఫ్యామిలీ రెస్టారెంట్, భిక్నూర్
- న్యూ ఉడిపి కృష్ణ భవన్, అడ్లూర్
- లుఫ్యాన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్, అడ్లూర్ ఎల్లారెడ్డి
- తాజ్ ఫ్యామిలీ దాబా, సదాశివనగర్
ఈ హోటళ్లలో పరిశుభ్రత లోపాలు, ఆహార పదార్థాల సక్రమ నిల్వ లేకపోవడం, కీటకాల ఉనికి, గడువు ముగిసిన పదార్థాలు, వంటగది అపరిశుభ్రత వంటి తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అలాగే శ్రీ ఆధ్య గ్రాండ్ రెస్టారెంట్, జంగంపల్లికి షోకాజ్ నోటీసు, ఆర్.ఎస్. గ్రాండ్ రెస్టారెంట్, నర్సన్నపల్లెకు ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేశారు.
మూడు జిల్లాల్లో మొత్తం 21 ఆహార నమూనాలు సేకరించగా, 9 సంస్థల లైసెన్సులు సస్పెండ్, 6 సంస్థలకు షోకాజ్, 5 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Post a Comment