Indira Gandhi Vardhanti | బాన్సువాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాళి - నాయకుల నివాళులు

భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 42వ వర్ధంతి

బాన్సువాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాళి - నాయకుల నివాళులు

రోటీ, కపడా, మకాన్, గరీబీ హటావో నినాదాలతో దేశ సేవ అని కొనియాడిన వక్తలు

బాన్సువాడ, అక్టోబర్ 31: భారతదేశ మొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని బాన్సువాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరా గాంధీ గారు 'రోటీ, కపడా ఔర్ మకాన్', 'గరీబీ హటావో' అనే నినాదంతో ముందుకు సాగారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని కొనియాడారు. దేశ ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని, దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయురాలని వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురు వినయ్ కుమార్, అలీ బిన్ అబుల్, గోపాల్ రెడ్డి, ఎజాజ్, కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, కౌన్సిలర్లు కలిక్, నందకిశోర్, వాంకర్ రమేష్, జంగం రాజశేఖర్, హకీం, లాయక్, కో-ఆప్షన్ మజ్జు, బొంగు గంగారం, సర్పంచ్ రమేష్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Video 👇




Post a Comment

Previous Post Next Post