BRS | ఆదిలాబాద్ రైతు గర్జన మహాసభకు బాన్సువాడ బీఆర్ఎస్ శ్రేణుల భారీ తరలింపు

ఆదిలాబాద్ రైతు గర్జన మహాసభకు బాన్సువాడ బీఆర్ఎస్ శ్రేణుల భారీ తరలింపు

రైతు గర్జన సభకు బయలుదేరిన కేటీఆర్‌కు ఘన స్వాగతం

గాంధారి ఎక్స్ రోడ్డు వద్ద శాలువాతో సన్మానించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

రైతు సమస్యలపై మహాసభ - వివిధ గ్రామాల నుండి పాల్గొన్న నాయకులు

బాన్సువాడ, నవంబర్ 1: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన మహాసభకు బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్బంగా జాతీయ రహదారి 44 పై ఎక్స్ రోడ్డు వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ ను కలిసారు. అక్కడి నుంచి వారిని అనుసరించారు.     

ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు.

ఆదివారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో చలో ఆదిలాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆదిలాబాద్‌కు బయలుదేరారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై నిర్వహిస్తున్న ఈ మహాసభలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తరలివెళ్లినట్లు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ మహాసభకు మద్దతుగా బాన్సువాడ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నియోజకవర్గం పరిశీలకుడు తోట ఆగయ్య,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్,  షేక్ అక్బర్, బాడీ శ్రీను, అతిఫ్, ఇసాక్, అందె రాజు, చందర్ తదితరులు ఉన్నారు.





Post a Comment

Previous Post Next Post