వర్నిలో రూ.12 కోట్లతో నూతన 30 పడకల ఆస్పత్రి
ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
వర్ని, నిజామాబాద్ - అక్టోబర్ 14: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో రూ.12 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన వాస్తు పూజ, బతుకమ్మ వేడుకల్లో ఆయన వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వం ఆస్పత్రులు నిర్మించి వైద్యులను నియమిస్తోందని అన్నారు. వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని సూచించారు. ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని, రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామన్నారు.
టీజీ ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ వర్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ 30 పడకల ఆస్పత్రి ఎంతో ఉపయోగపడుతుందని, అధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో DCHS శ్రీనివాస్ ప్రసాద్, DMHO రాజశ్రీ, జిల్లా వైద్యాధికారులు, స్థానిక నాయకులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.







Post a Comment