రుద్రూర్ తహసీల్దార్ తార బాయి సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 14: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల తహసీల్దార్ బి. తారాబాయిని విధుల పట్ల నిర్లక్ష్యం, అనుమతి లేకుండా గైర్హాజరు అయినందుకు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం (Proc.No.A3/1400/2026, Dt: 12.10.2026) -
రాష్ట్రంలో SIR (Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో పాల్గొనే EROలు, AEROలు, BLO సూపర్ వైజర్లు, BLOలను బదిలీ చేయవద్దని, సుదీర్ఘ సెలవులు మంజూరు చేయవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనూ భారత ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి తప్పనిసరి.
అయితే రుద్రూర్ మండల AEROగా ఉన్న తహసీల్దార్ బి. తారాబాయి SIR నోటీసుల జారీ, విచారణ, క్లెయిమ్స్ పరిష్కారం వంటి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయకుండా, 07.10.2026 నుండి జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. ఇది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంగా కలెక్టర్ పేర్కొన్నారు.
దీంతో A.P.C.S.(CCA) Rules, 1991 లోని Rule-8 (1a) R/w Rule-19 ప్రకారం తారాబాయిని తక్షణమే సస్పెన్షన్‌లో ఉంచుతున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో తెలిపారు. క్రమశిక్షణా చర్యలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సస్పెన్షన్ కాలంలో ఆమె ప్రధాన కార్యాలయం నిజామాబాద్‌గా ఉంటుందని, కలెక్టర్ అనుమతి లేకుండా కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని, FR 53(1) ప్రకారం జీవన భృతి అందుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Post a Comment