MLA PSR | స్వగ్రామం పోచారంలో వాహన పూజలు, రామాలయంలో పట్టువస్త్రాల సమర్పణ

విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం శ్రీనివాసరెడ్డి

స్వగ్రామం పోచారంలో వాహన పూజలు, రామాలయంలో పట్టువస్త్రాల సమర్పణ

మతసామరస్యానికి ప్రతీకగా మహబూబ్ సుభాని దర్గా వద్ద జెండా ఎగురవేత

పోచారం, 20 అక్టోబర్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ గ్రామీణ మండలంలోని తన స్వగ్రామం పోచారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Video 👇



ప్రతి సంవత్సరం విజయదశమి రోజున పోచారం కుటుంబం ఆనవాయితీగా నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఆంజనేయస్వామి ఆలయం నుంచి జెండాను తీసుకువచ్చి, తన నివాసం సమీపంలోని మహబూబ్ సుభాని దర్గా వద్ద ఎగురవేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సంప్రదాయం మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోంది.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వాహన పూజలు నిర్వహించారు. పోచారం గ్రామంలోని రామాలయాన్ని సందర్శించి, శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ యువత ప్రతిష్ఠించిన దుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. విజయదశమి పర్వదినం సందర్భంగా సంప్రదాయంలో భాగంగా పాలపిట్టను కూడా దర్శించుకున్నారు.

ఈ పూజా కార్యక్రమాల్లో  పరిగె వెంకట్ రామ్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్  పోచారం భాస్కర్ రెడ్డి,  పోచారం సురేందర్ రెడ్డి తో పాటు పోచారం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post